కుత్బుల్లాపూర్ అక్టోబర్ 23: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో రూ.10.75 కోట్లతో నూతనంగా నిర్మించనున్న కల్వర్టులు,రిటైనింగ్ వాల్ పనులకు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు వరదతో వాహనదారులన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో, యుద్ధప్రాతిపదికన కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా భారీ వాహనాలు మరొక దారిలో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీశైలంయాదవ్, దూలపల్లి పీఏసీఎస్ నరేందర్ రాజు, కమిషనర్ రఘ, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఎన్డీపీ ఈసీ వసంత, ఎస్ఈ ఆనంద్, ఈఈ నారాయణ, డీఈ నరేందర్, ఏఈ రామారావు, సీఐలు ప్రశాంత్, రాజు,సిబ్బంది, పార్టీ శ్రేణులు దేవేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి చౌర స్తా వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, హన్మంతరావు తో పాటు ట్రాఫిక్, మున్సిపాలిటీ అధికారులతో కలిసి పర్యటించారు. నిత్యం తీవ్రమైన ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా దూలపల్లి చౌరస్తా వద్ద ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అదే విధంగా కొం పల్లి చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా బహదూర్ పల్లి వెళ్లే రోడ్డులో స్థానికులతో కలిసి ఎమ్మెల్యేలు పర్యటించి సమస్యను పరిశీలించారు. గుంతలమయమైన రోడ్డుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేగంగా రోడ్డు ప్యాచ్ వర్క్‌లకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా బహదూరపల్లి వెళ్లే రోడ్డు అభివృద్ధి ఇప్పటికే రూ.20కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు.