మియాపూర్, అక్టోబర్ 23 : శెట్టి బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హైదర్‌నగర్ డివిజన్ శాతవాహన కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షులుగా గుత్తుల మీరాకుమార్, ప్రధాన కార్యదర్శిగా కొప్పిశెట్టి వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా దూనబోయిన వెంకట సత్యనారాయణ, మామిడి శెట్టి నాగేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాగేశ్వర్రావు, నిర్వాహక కార్యదర్శులుగా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్రావు, వాసంశెట్టి వెంకటేశ్వర్రావు, కోశాధికారిగా గోపాలకృష్ణ, సహాయకార్యదర్శులుగా బొంతవెంకటేశ్వర్రావు, లక్ష్మణరావు, వెంకటేశ్వర్రావు, పంతులు, సలహాదారులుగా సత్యనారాయణ, రాజాబాబు, సత్యనారాయణమూర్తి, నారాయణ, గోవిందరావు, సహా మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మీరా కుమార్ మాట్లాడుతూ.. బీసీల నుంచి తొలగించిన 26 శెట్టి బలిజకులాల్ని బీసీలో చేర్చాలని కోరారు. నగరంలో సంఘానికి అయిదెకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. త్వరలో తమ సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిని అందించనున్నట్లు మీరా కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలలో సంఘ కార్యవర్గాలను ఏర్పాటు చేసి మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.