ఉప్పల్, అక్టోబర్ 23 : ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. ఆర్ఏ కెమికల్ ఫార్మా అండ్ నీర్మాన్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాచారం సీడీఎస్ భవనంలోని బస్తీ దవాఖానలో ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు.. ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. హాజరైన కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మయూర్, రవికుమార్, బీఆర్ఎస్(టీఆర్ఎస్) నాయకులు సాయిజెన్ శేఖర్, శ్రీరామ్ సత్యనారాయణ, కట్ట బుచ్చన్నగౌడ్, శ్రీనివాస్, మహేశ్, సువర్ణ సుగుణాకర్రావు, లడ్డు శివ, శ్రీనివాస్, రెబల్ రాజు, షాహిన్బేగం, జస్వంత్, రాజేశ్ పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక కాప్రా, కీసర, మల్కాజిగిరి మండల కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం చర్లపల్లి డివిజన్, చక్రీపురం లోని చక్రీ విద్యానికేతన్ హైస్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. డాక్టర్లు దశరథ్, విద్యాసాగర్, రాంబాబులు బీపీ, షుగర్, తదితర వైద్యపరీక్షలు నిర్వహించారు. శిబిరానికి 172మంది హాజర య్యారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు
నాగరాజు, జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీనివాస్, శేషు, నరసింహారావు, శివప్రసాద్, శశాంక, సోమయ్యచారి, రమణారెడ్డి, సంజన, శ్రావణ్, అండాళ్, శివ శంకర్రెడ్డి, రామ్మోహన్రావు, లీలారాణి,
జెన్నీ, ప్రభాకర్, సురేశ్, రవి, వెంకట్ పాల్గొన్నారు.