సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రంగురంగుల వెలుగులు, ఆనందాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ చిన్నపాటి తప్పిదాలతో జీవితం చికటి మయంగా మారడం ఖాయం. పటాకులు కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండక పో వడం, అత్యుత్సాహంతో చేతిలో పట్టుకుని పేల్చడంతో ప్రమాదాలు జరుగు తుంటాయి. దీపావళి రోజు ప్రతిఒక్కరూ జాగ్రతలు పాటించాలని సరోజినీ కంటి దవాఖాన మాజీ సూపరింటెండెంట్, ప్రముఖ కంటి వైద్యనిపుణుడు డాక్టర్ రవీందర్‌గౌడ్ సూచిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మార్కెట్లలో పండుగల సందర్భంగా పండ్లు, పూలు పోటెత్తుతున్నాయి. దీపావళి పండుగ సోమవారమే కావడంతో అన్ని మార్కెట్లు పండ్లు, పూలతో కళకళలాడుతున్నాయి. పండుగ సందర్భంగా గడ్డిఅన్నారంలోని వ్యవసాయ పండ్ల మార్కెట్లో ఒక్కరోజే రూ.3కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లోలాగే కాకుండా 130 పండ్ల లోడ్లు వచ్చినట్లు తెలిపారు. అలాగే గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్లో బంతిపూలు 200వందల క్వింటాళ్ల వరకు వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి నరేందర్ తెలిపారు. అయితే ధర మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉందని, రెండ్రోజుల్లో ధర పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.