దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల,అక్టోబర్21: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ జన్మదిన వేడుకలు శుక్రవారం పేట్‌బషీరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఆయన అభిమానులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌లు కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే వివేకానంద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుగా టీఆర్ఎస్ శ్రేణులు వారిద్దరిని గజమాలతో సత్కరించారు. అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సైతం ఎమ్మెల్యే వివేకానంద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ శుక్రవారం బహదూర్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 173 మందికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. అనంతరం గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అదేవిధంగా గాంధీనగర్‌లో ఉచివైద్య శిబిరం నిర్వహించి పేదలకు వైద్యసేవలు అందిచారు.