గౌతంనగర్, అక్టోబర్ 16 : మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, పిల్లీనర్సింగ్రావు బస్తీ, షఫీనగర్, జీఎస్ఆర్ గార్డెన్, బృందావన్ కా లనీ, ప్రగతినగర్, చందాబాగ్, ఎస్పీనగర్, వడ్డెర బస్తీలో సీసీ రోడ్లు, ఆర్సీసీ పైపులైన్లు, సాదుల్లానగర్‌లో గ్రేవీయాడ్, బాగ్ హైదరీలలో రూ.3.25కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ.. పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. కాలనీలు, బస్తీల్లో దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు చేపడు తున్నామని, డిసెంబర్‌లోగా సీసీ రోడ్ల పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని తెలిపారు. సమస్యలు ఉన్న ప్రాంతాలను తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మౌలాలి డివిజన్‌కు రూ.8కోట్లు మంజూరు చేయించామని.. ఈ నిధులతో కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. మౌలాలి ముస్లిం గ్రేవీయార్డులో రోడ్డు, బోర్ ఏర్పాటు చేస్తామని, సాదుల్లానగర్‌లో నూతనంగా స్ట్రామ్ వాటర్ లైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఇంటి జాగలు ఉంటే..
త్వరలో ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు, ఈఈ లక్ష్మణ్, జలమండలి జీఎం సునీల్‌కుమార్, డీఈ మహేశ్, ఏఈ మధురిమ, ఎలక్ట్రికల్ ఏఈ వెంకటేశ్, మేనేజర్ శ్రీనివాస్, శానిటేషన్ అధికారి నాగరా జు, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అమీనొద్దీన్, జీఎన్వీ సతీశ్‌కుమార్, మేకల రాముయాదవ్, భాగ్యానందరావు, సంతోశ్రాందాస్, మౌలాలి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్తయ్య, మంద భాస్కర్, సంతోశ్నాయుడు, ఆదినారాయణ, పూలపల్లి జగదీశ్‌యాదవ్, సందీప్, ఇబ్రహీం, చందు, మోహన్‌రెడ్డి, సందీప్‌గౌడ్, సిక్క చంద్రశేఖర్‌గౌడ్, నాగేశ్, దుర్గేశ్, నహీమ్ఖాన్, గౌలికర్ శైలేందర్, గౌలికర్ దినేశ్ ,తదితరులు పాల్గొన్నారు.