జూబ్లీహిల్స్, అక్టోబర్ 15: నగర పాలక సంస్థ ఆస్తిపన్ను వడ్డీపై అందిస్తున్న రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. దీంతో జీహెచ్ఎంసీ అందిస్తున్న ఆఫర్‌ను అందిపుచ్చుకోనివారికి ఆశాభంగం కలుగనుంది. సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా అలసత్వం వహిస్తున్న మొండి బకాయిదారులకు బల్దియా ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ప్రకటించింది. సదరు వడ్డీలతో తడిసి మోపెడవుతున్న ఆస్తిపన్నుకు 10 శాతం వడ్డీ మాత్రమే చెల్లించే అవకాశాన్ని నగర పాలక సంస్థ కల్పించింది. ఈ నెల 31 వరకు సదరు ఆస్తిపన్ను చెల్లించని వారికి వారి బకాయిలు.. వడ్డీతో పాటు యధాతథ స్థితిలో ఉంటాయి. దీంతో మరో ఆర్థిక సంవత్సరంలో వడ్డీభారం రెట్టింపు కానుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జీహెచ్ఎంసీ కల్పించిన ఈ వడ్డీ రాయితీ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్ను బకాయీలు వెంటనే చెల్లించాలని డీఎంసీ రమేశ్ సూచించారు. బకాయి ఉన్న ఆస్తి పన్ను చెల్లించని వారికి నవంబర్ నుంచి పాత ప్రాపర్టీ ట్యాక్స్ నమోదవుతుంది. ఈ ఆఫర్ వడ్డీపై 90 శాతం రాయితీ అయినందున వెంటనే చెల్లించి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆస్తిపన్ను బకాయిలు నవంబర్ 1 తరువాత చెల్లించే వారికి ఈ వెసులుబాటు ఉండదు. యూసుఫ్‌గూడ సర్కిల్ లో సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు వచ్చి ఆస్తిపన్ను ఇంటివద్దే జమచేసుకుంటారు. పన్ను చెల్లింపుదారులు బిల్ కలెక్టర్లకు నేరుగా చెల్లించవవచ్చని.. మీ సేవా కేంద్రాలతో పాటు ఆన్లైన్లో కానీ, సర్కిల్ కార్యాలయంలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లో కానీ తమ ఆస్తిపన్ను చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించాల్సిన బిల్ కలెక్టర్లు/ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..