కీసర, అక్టోబర్ 14: మహాత్మజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల్లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడోత్సవాలకు క్రీడాకారుల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ గురుకుల పాఠశాల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు భారీ ఎత్తున్న నిర్వహిస్తున్నారు. కీసరగుట్టలోని బాలికల గురుకుల పాఠశాల్లో నాంపల్లి, చార్మీనార్, మలక్‌పేట్ ప్రాంతాలకు చెందిన పాఠశాలలు దిగ్విజయంగా నడుస్తున్నాయి. ఇక్కడి పాఠశాల్లో విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లాస్థాయి క్రీడలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రీడలను బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు లాంఛనంగా ప్రారంభించిన విషయం విధితమే. ఈ క్రీడోత్సవాలకు పలు ప్రాంతాల నుంచి సుమారు 15 బీసీ బాలికల గురుకుల పాఠశాలలకు సంబంధించిన రెసిడెన్షియల్ విద్యార్థులు, 7 మహాత్మజ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ కళాశాలకు చెందిన విద్యార్థులు విచ్చేశారు. ఇక్కడ ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, టెన్నికాయిట్, అథెట్లిక్ తదితర క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల్లో నిర్వహిస్తున్న క్రీడాకారులు రాష్ట్ర, దేశ, జాతీయ స్థాయిలో కూడా పలు రకాల ఆటలను ఆడి చక్కగా రాణిస్తున్నారు. పాఠశాలల విద్యార్థులు రాష్ట్రంలో గొప్పగా ఎదుగుతూ రాష్ట్రంతో పాటు దేశానికి గొప్ప గౌరవాన్ని సాధించి పెడుతున్నారు. క్రీడలు శరీర దారుఢ్యానికి, ఏకాగ్రతకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయన్న నిజాన్ని తెలుసుకున్న విద్యార్థులు పలు క్రీడల్లో చురుకుగా పాల్గొని విజేతలవుతున్నారు.
విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య క్రీడలను నిర్వహిస్తున్నాం. మొత్తం 15 గురుకుల పాఠశాలలు, 7 గురుకుల జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు క్రీడలను ఆడటానికి విచ్చేశారు. పీఈటీల సహకారంతో ఇక్కడ క్రీడలను చక్కగా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్న ఉద్దేశ్యంతో ఈ క్రీడలను నిర్వహించి విద్యార్థులకు మెదడుకు మరింత పదునుపెడుతున్నాం. విజేతల వివరాలను ఈనెల 15న (నేడు) ప్రకటించి ముఖ్యఅతిథుల చేత బహుమతులను ప్రదానం చేస్తాం.
– రాములు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
క్రీడలంటే మహా ఇష్టం.. 5వ తరగతి నుంచి మహాత్మజ్యోతిబాఫూలే గురుకులంలోనే చదువుతున్నాను. ఇక్క డ చదువుతో పాటు క్రీడల్లో చక్కటి శిక్షణ ఇస్తున్నారు. షాట్‌ఫుట్‌లో ప్రథమ బహుమతి సాధించాను. కబడ్డీ, ఖో ఖో అంటే ఎంతో ఇష్టమైన క్రీడలు. క్రీడలతో పాటు చదువులో కూడా బాగా రాణిస్తున్నాను.
– మీనాక్షి, ఇంటర్ సెకండ్ ఇయర్, చార్మీనార్
చదువుతో పాటు క్రీడలంటే ఎంతో ఇష్టం. 400 మీటర్స్ రన్నింగ్‌లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాను. చిన్నప్పటి నుంచి చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రథమంగా నిలుస్తున్నాను. తను స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యం. ఉపాధ్యాయుల ప్రోత్సా హం ఎంతగానో ఉపయోగపడుతుంది.
– జె.రాధిక, సెకండ్ ఇయర్, మలక్‌పేట్
మహాత్మజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల్లో ఒక సిస్ట మ్ ప్రకారం విద్యతో పాటు క్రీడలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఉన్న ఆశలు, కళలు చక్కగా సాకారం అవుతున్నాయి. 1500 మీట ర్ల రన్నింగ్‌లో ఫస్ట్ ప్రైజ్ సాధించాను. చదువుతో పాటు క్రీడలను ఆడిస్తే శరీర ధారుఢ్యానికి, ఏకగ్రతకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపతున్నాయి.
– ఎస్.భవాని, ఇంటర్, మలక్‌పేట్