బడంగ్‌పేట, అక్టోబర్ 14 : నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడినా.. విక్రయించినా చట్టరీత్యా చర్యలుంటాయని.. ప్రతి మనిషికి పరిశుభ్రత అవసరమని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తడి పొడి చెత్తను ఎలా రీ సైక్లింగ్ చేయాలన్న అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోల్లో వేయాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. పొల్యూషన్ కాకుండా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్ బాబు, మారి సంస్థ ప్రతినిధులు శివానీరెడ్డి, రామ కృష్ణ, ఆర్పీలు తదితరులు ఉన్నారు.
బడంగ్‌పేట, అక్టోబర్ 14 : ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్ హెచ్చరించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం జరిగిందని అన్నారు. శుక్రవారం మీర్‌పేటలో ఆర్పీలు, డ్వాక్రా సంఘాల సభ్యులు తయారు చేసిన జూటీ బ్యాగ్‌లను వాడాలని అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు వాడితే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు పేపర్, జూటీ బ్యాగ్‌లు, కాటన్ బ్యాగులు వాడాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడటంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త ఆటోల్లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్వో వెంకట్ రెడ్డి, ఆర్పీలు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.