కీసర, అక్టోబర్ 13: కీసరగుట్ట సమీపంలోని మహాత్మాజ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలలో బాలికల విభాగం జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారంప్రారంభం అయ్యాయి. ఈ పోటీల్లో నాంపల్లి, చార్మినార్, మలక్‌పేట్‌కు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.ఈ క్రీడా పోటీలను బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.అంతకు ముందు విద్యార్థులు, పాఠశాల ప్రిన్సిపాల్ రాములు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థినులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
ఈ క్రీడల్లో 15 రెసిడెన్షియల్ పాఠశాలలు, 7 రెసిడెన్షియల్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, టెనికాయిట్, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ విద్యార్థినులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చార్మినార్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని మౌనిక ‘రైఫిల్’ షూటింగ్లో జాతీయస్థాయిలో ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంద ని కొనియాడారు. ఈనెల 15వ తేదీ వరకు క్రీడాపోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారి ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.