సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : సమాచార హక్కు చట్టం పట్ల గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సమాచార హక్కు చట్టం మాజీ చీఫ్ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, నగరంలోని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ప్రసంగించారు. ప్రతి పౌరుడి చేతిలో సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం లాంటిదని తెలిపారు. జస్టిస్ గుండా చంద్రయ్య మాట్లాడుతూ ఈ చట్టాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటే లంచగొండితనం అంతమొందడంతోపాటు న్యాయస్థానాల మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అన్నారు. జస్టిస్ డాక్టర్ గురుగుబెల్లి యతిరాజు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుడికి అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని తెలిపారు.
సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం స్థాపనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి ‘సమాచార హకు చట్టం ముందడుగు’ లోగోను ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు, విశ్రాంత డీజీపీ సీఎన్ గోపీనాథ్ రెడ్డి, జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దుచ్చర్ల సత్యనారాయణ, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు డీఎల్ పాండు, అడిషనల్ డీసీపీ బోయిని కృష్టయ్య, కొండవీటి సత్యవతి, బండమీది అంజయ్య, పి.ధర్మరాజు, గాదం ఉత్తరయ్య, యాల మల్లయ్య, మిద్దె శ్రీదేవి, కన్నెబోయిన ఉషారాణి, కె.మల్లేశ్వరరావు, అమృతరావు, కొన్నె దేవేందర్, వరికుప్పల గంగాధర్, కోమటి రమేశ్ బాబు, చింత శ్రీనువాస్, అంజుకర్, శివనాగరాజు, నరేశ్, పాల్గొన్నారు