ఉప్పల్, అక్టోబర్ 7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి మునుగోడు ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో కేటాయించిన వార్డులో ప్రచారం చేయనున్నామని తెలిపారు. మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తామన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, వేముల సంతోష్‌రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, డాక్టర్ బీవీ.చారి, పల్లె నర్సింగ్‌రావు, సుగుడు మహేందర్‌రెడ్డి, డప్పు గిరిబాబు, కొరేపాక అంజి, పిట్టల నరేశ్, తదితరులు పాల్గొన్నారు.