చిక్కడపల్లి, అక్టోబర్ 6 : బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వాకర్స్, సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. పార్కుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చెయ్యడంతో పార్కులో అనేక అభివృద్ధి పనులు జరిగాయి.. కాగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ చొరవతో సుందరయ్య పార్కు అభివృద్ధి కోసం రూ. 36 లక్షలు మంజూరు చే యించారు. ఈ నిధులతో ఓపెన్ జిమ్, ఫ్లోరింగ్, రేలింగ్, పార్కు గేటు ఆర్చీ, పిల్లల ఆటల పరికరాలు ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. దీంతో సుందరయ్య పార్కుకు ప్రతి రోజూ వాకర్స్‌తో పాటు, సందర్శకులు, పిల్లలు అధిక సంఖ్యలో వస్తున్నారు.
వాకర్స్ కోసం ఇటీవల ఓపెన్ జిమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో వ్యాయామం చేసుకోవడానికి ఈ జిమ్ వాకర్స్‌కు ఎంతో ఉపయోగ పడుతున్నది. అన్ని పరికారాలు అందుబాటులో ఉంచడంతో వ్యాయామం చేసుకోవడానికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.
పార్కుల అబివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. అందులో భాగంగానే నగరంలోనే బెస్ట్ పార్కుగా సుందరయ్య పార్కును తీర్చిదిదాం. దీంతో వాకర్స్, సందర్శకులకు ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా మారింది.
– ఎమ్మెల్యే ముఠా గోపాల్