ఆర్కేపురం/బడంగ్‌పేట, అక్టోబర్ 6 : దసరా ఉత్సవాల సందర్భంగా జవహర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లోని మండల గ్రౌండ్లో బుధవారం రాత్రి రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ రావణ దహనాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాతేల్లి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత జీవితరాజశేఖర్, స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్, మాజీ కౌన్సిలర్ సాతేల్లి రాధనాగరాజ్, దాసరి మల్లేశం, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు గండు ధనంరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చింతల బాల్‌రాజ్‌గుప్తా, బాణాల ప్రవీణ్, రవిబాబు, యువజన సంఘం ప్రతినిధులు జైన్బాబు, భగవంత్‌రాజ్, దేవేందర్‌ముదిరాజ్, సిద్ధు ముదిరాజ్, సుదర్శన్ముదిరాజ్, రాఘవేంద్రగుప్తా, జహీర్, శరత్‌రాజ్, చైతన్య, శ్రీనివాస్, భూపేందర్, మహేందర్‌ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్లో రాజీవ్ గాంధీ చౌరస్తాలో సూర్య, చంద్రుల ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువ నాయకుడు చిలుక ఉపేందర్‌రెడ్డి హాజరై రావణ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డాకియార్ నాయక్, గునగంటి వెంకటేశ్‌గౌడ్, ఏర్పుల హరి, పెద్దవూర సైదులు, మహేశ్, జహంగీర్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట : విజయదశమిని పురస్కరించుకుని మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో రావణాసురుడి దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్లోర్ లీడర్ అరకల భూపాల్‌రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ అర్కల కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు బొక్క రాజేందర్‌రెడ్డి, గజ్జల రాంచందర్, నాయకులు పోరెడ్డి భాస్కర్‌రెడ్డి, సిద్దాల బీరప్ప, జంగారెడ్డి, కొత్త జనార్దన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చారి, సూర్యరెడ్డి, ఏమాద్రి తదితరులు పాల్గొన్నారు.