దుండిగల్/కుత్బుల్లాపూర్/గాజులరామారం, సెప్టెంబర్ 30: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమపిల్లా, పాపలను చల్లంగా చూడాలని వేడుకుంటున్నారు. వేదపండితుల మంత్రోశ్చారణలతో ఆలయాలవద్ద సరికొత్త ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శుక్రవారం ఐదవరోజు అమ్మవారు భక్తులకు లలితాదేవి, స్కంధామాతగా దర్శనమిచ్చారు.
నిజాంపేటలోని దుర్గామాత ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారు భక్తులకు స్కంధామాతగా, ఉత్సవమూర్తి లక్ష్మిదేవిగా దర్శనమిచ్చింది. ఆలయ ధర్మకర్త, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్శ్రీనివాస్రెడ్డి (కేఎస్ఆర్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయంలో చంఢీహోమం నిర్వహించారు. కార్పొరేటర్లు కొలన్ తేజాశ్రీనివాస్రెడ్డి, బొర్ర దేవిచందూముదిరాజు, వెంకటేశం వంటి ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి శుక్రవారం నిజాంపేటలోని కనకదుర్గమాత ఆలయాన్ని, కూకట్పల్లి శివాలయంలోని శ్రీలలితాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం నిర్వహించిన కుంకుమార్చనలో పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని కనకదుర్గమాత ఉత్సవ విగ్రహాలను మున్సిపాలిటీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, అర్కల అనంతస్వామి, టీఆర్ఎస్ నేతలు రాఘవేంద్రగౌడ్, ప్రకాశ్, కుమార్, ప్రశాంత్ తదితరులు దర్శించకుని ప్రత్యేకపూజలు చేశారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాశ్‌నగర్ డివిజన్లో దుర్గా శాంభవి మహిళామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద శుక్రవారం అన్న సమారాధన నిర్వహించారు. సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మహిళామండలి సభ్యులు క్రిష్ణవేణి, అరుణ, స్వర్ణ, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధి ఎంఎన్రెడ్డినగర్ ఫేస్-1లో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సుధాకర్‌గౌడ్, కాలనీ అధ్యక్షుడు సంపత్‌గౌడ్, బాలచందర్‌గౌడ్, ఎల్లాగౌడ్, రవీందర్‌గౌడ్, రవీందర్‌గౌడ్, రజిణి, ఉమారాణి, నిర్మళ, శ్రీవల్లితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్‌గౌడ్, యువనాయకులు కేపీ విశాల్గౌడ్లు హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయ యువజన సంఘం సభ్యులు, దుర్గామాత సభ్యులు పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్లో వెలసిన శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు లక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.