– డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. అగర్వాల్
వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 29: వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన వ్యవసాయ శాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉందని ఐకార్, నేషనల్ డైరెక్టర్ (ఎన్ఎహెచ్ఈపీ ) న్యూఢిల్లీ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఆర్సీ అగర్వాల్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఐసీఏఆర్ – నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్ మెంట్, నేషనల్ అగ్రికల్చర్ హయ్యార్ ఎడ్యూకేషన్ ప్రాజెక్టు ( ఎన్ఎహెచ్ఈపీ) ఆధ్వర్యంలో భారత దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల ద్వారా వ్యవసాయ ఉన్నత విద్యను మేయిన్ స్ట్రీమింగ్ చేయడం అనే అంశంపై జాతీయ సింపోజియం జరిగింది. వ్యవసాయ ఉన్నత విద్య పాలన , ప్రైవేటు విద్య ప్రధాన స్రవంతికి వివిధ సమస్యల పై చర్చించారు. యూపీలోని తీర్ధాంకర్ మహావీర్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ రఘువీర్ సింగ్, సోబిత్ విశ్వవిద్యాలయం చాన్సలర్ కున్వర్ శేఖర్ విజేంద్ర, అనంతపురం ఇన్నోవేషన్ యూనివర్సిటీ చాన్సలర్ డా. రూపావాసుదేవన్ ,నార్మ్ డైరెక్టర్ డా. సీహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్కే సోమ్ తదితరులు పాల్గొన్నారు.