బంజారాహిల్స్,సెప్టెంబర్ 29: ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉత్సవాలు హుషారుగా సాగుతున్నాయి. ఎనిమిదోరోజు గురువారం బంజారాహిల్స్ రోడ్ నం 3లోని ఫ్రీడమ్ ఆయిల్ కార్యాలయంలో లక్కీ డ్రా తీశారు. ‘నమస్తే తెలంగాణ అడ్వర్టయిజింగ్ విభాగం జనరల్ మేనేజర్ సురేందర్‌రావు, ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ మేనేజర్ మధుసూదన్‌రెడ్డిలతో పాటు ఫ్రీడమ్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, డీజీఎం చేతన్, మార్కెటింగ్ మేనేజర్ మేఘా సోని, సంస్థ ప్రతినిధులు సురేశ్, వెంకట్‌తో పాటు వినియోగదారుల సమక్షంలో లక్కీ డ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి చింతల్‌లోని సీఎంఆర్ మాల్లో షాపింగ్ చేసిన గృహిణి బషీర్ సుల్తానా గెలుచుకున్నారు. రెండో బహుమతిని చరణ్‌సాయి ఎంటర్ప్రైజెస్ డిస్టిబ్యూటర్స్‌కు చెందిన శ్రీశివ, మూడో బహుమతిని చరణ్‌సాయి ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సాయి శ్రీనివాస్, నాలుగో బహుమతిని కేఎల్ఎం మాల్లో షాపింగ్ చేసిన లక్ష్మీనారాయణ, ఐదో బహుమతిని వరుణ్మోటర్స్లో షాపింగ్ చేసిన సింధు గెలుపొందారు.
భాగస్వాములుగా ఉన్నాం
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజాతో ఎనిమిదేండ్లుగా భాగస్వామ్యం ఉంది. కరోనా తర్వాత వినియోగదారుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు ఇలాంటి లక్కీ డ్రాలు ఎంతో ఉపయోగపడతాయి. నాణ్యతకు భరోసా ఇచ్చేలా ఫ్రీడమ్ ఆయిల్ ఉత్పత్తులు ఉంటాయి. అందుకే ఈ రంగంలో మా సంస్థ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నది. ఇలాంటి బొనాంజా వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది.
– పి.చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫ్రీడమ్ ఆయిల్
మంచి అవకాశం
‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దసరా బొనాంజాలో పాల్గొన్న వారికి బహుమతులతో పాటు ఫ్రీడమ్ ఉత్పత్తులతో ఆనందం కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే మా ప్రాధాన్యత. మరింత మంది ఈ బొనాంజా వేడుకల్లో పాల్గొని అదృష్టాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కస్టమర్లకు ఈ బొనాంజా మంచి అవకాశంగా నిలుస్తుంది. ఇలాంటి బొనాంజాల్లో మేము భవిష్యత్‌లో కూడా పాలుపంచుకుంటాం.
– చేతన్, డీజీఎం మార్కెటింగ్, ఫ్రీడమ్ ఆయిల్
అదృష్టలక్ష్మి ఇంటికి వచ్చింది..
ఏటా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా కాలనీలో ఆలయాల్లో అమ్మవారి పూజల కోసం చీరలు పెడుతుం టాం. అమ్మవారి చీరల కోసం చింతల్‌లోని సీఎంఆర్‌లో బుధవారం షాపింగ్ చేశాం. అక్కడ ‘నమస్తే తె లంగాణ -తెలంగాణ టుడే’ దసరా బొనాంజా కూపన్లు ఇచ్చారు. మాకు గురువారం లక్కీడ్రాలో మొదటి బ హుమతి వచ్చిందని చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. అమ్మవారి కటాక్షంతో అదృష్టలక్ష్మి ఇంటికి వచ్చిందనిపించింది. ఇప్పటిదాకా ఎన్నో సార్లు వేరేచోట్ల కూపన్లు రాసినా ఎప్పుడు బహుమతి రాలే దు. ‘నమస్తేతెలంగాణ’ దసరా బొ నాంజా రావడం ఆనందంగా ఉంది.
– బషీర్ సుల్తానా, గృహిణి,(మొదటి బహుమతి విజేత)
అభినందనీయం
వినియోగదారులకు ఆనందాన్ని కలిగించేందుకు ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ పత్రికల ద్వారా దసరా బొనాంజా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. సాధారణ సమయంలో కన్నా పండుగల సీజన్లో షాపింగ్ ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి సీజన్లో లక్కీడ్రాలో బహుమతులు వస్తే వారి ఆనందం మరింత పెరుగుతుంది. ఫ్రీడమ్ సంస్థ ఎనిమిదేండ్ల నుంచి బొనాంజా వేడుకల్లో స్పాన్సర్‌గా కొనసాగుతోంది. ఫ్రీడమ్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి బహుమతులు రావడం సంతోషకరం.
– మేఘా సోని, మేనేజర్, మార్కెటింగ్, ఫ్రీడమ్ ఆయిల్