శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18: సేవ్ వాటర్ సేవ్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ‘మై ప్లానెట్ మై రెస్పాన్సిబులిటీ’ థీమ్‌తో మాతృభూమిని సంరక్షించుకునేందుకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ‘ఓజోన్ రన్’ ఉత్సాహంగా సాగింది. నగరానికి చెందిన వేలాది మంది ఔత్సాహికులు 10కే, 5కే, 2కే రన్లో పాల్గొని సందడి చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్లతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ‘ఊరికో జమ్మి-గుడికో జమ్మి’, ‘వాక్ ఫర్ సాయిల్’ కార్యక్రమాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్‌బాబు, సీజీఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, గచ్చిబౌలి సీఐ సురేశ్, కోచ్ నాగపూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నగరానికి చెందిన చిన్మయ్ సిద్ధార్థ్ షా తన 14వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి జూ పార్కును సందర్శించి.. ఓ చీతాను ఆరు మాసాల పాటు దత్తత తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి క్యూరేటర్ రాజశేఖర్‌కు రూ. 37,500 విలువైనచెక్కును అందజేశాడు.
– చార్మినార్, సెప్టెంబర్ 18