మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 15 : నులి పురుగులను నివారించి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదామని వక్తలు ప్రజలకు పిలుపునిచ్చారు. నులి పురుగుల నివారణ దినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నులిపురుగుల మాత్రలపై అపోహలకు పోకుండా విధిగా విద్యార్థులు తీసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నులి పురుగులతో విద్యార్థుల్లో వివిధ రకాల్లో సమస్యలు తలెత్తి, చదువుపై శ్రద్ధ చూపే అవకాశం ఉండదన్నారు. 19 ఏండ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను వినియోగించవచ్చని తెలిపారు.
బోడుప్పల్ : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి 11వ డివిజన్లోని తనిష్క్ పాఠశాలలో కార్పొరేటర్ కొత్త శ్రీవిద్యాచక్రపాణిగౌడ్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, ఏఎన్ఎం మంగ, రఘు, పద్మనాభం, నారాయణయాదవ్, మహేశ్, శ్రీనివాస్‌గుప్తా పాల్గొన్నారు.
ఘట్కేసర్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ నులిపురుగుల నివారణ మందులు వేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు చైర్మన్ కొండల్‌రెడ్డి నులి పురుగుల నివారణ మందులు వేశారు. కమిషనర్లు నరేశ్, వసంత, డాక్టర్ యాదగిరి, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కీసర : మండల పరిధిలోని చీర్యాల్, భోగారం గ్రామాల్లో కీసర పీహెచ్సీ ఆధ్వర్యంలో పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు ధర్మేందర్, కవితాజైహింద్రెడ్డి, ఉప సర్పంచులు జానకీరాం, తిరుమలరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్ : నులి పురుగుల నివారణ మాత్రలు తీసుకుని పిల్లల్లో రక్తహీనతను పారదోలాలని జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు వేశారు. వైద్యాధికారి పద్మావతి, వైద్య సిబ్బంది షౌకత్‌అలీ, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : మండల పరిధిలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఏనుగు కావేరి మశ్చేందర్ రెడ్డి వద్యార్థులకు నులి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు. నాయకులు మశ్చేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు కరుణ, విశ్వశాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, బండ్లగూడలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా ల్లో పిల్లలకు నులి పురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
శామీర్‌పేట : ముఖ్యమంత్రి దత్తత గ్రామం కేశవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గోనె హనుమంతరెడ్డి, ఇన్చార్జి డాక్టర్ హారతి పాల్గొన్నారు. శామీర్‌పేటలో ఎంపీపీ ఎల్లూబాయి బాబు మాత్రలను పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు రాజశేఖర్, సబిత, బిల్ కలెక్టర్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.