కవాడిగూడ, సెస్టెంబర్ 10: దళితులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దేశం లో ఎక్కడాలేని విధంగా ధళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దళితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్‌కు చెందిన హైత స్వప్న సా యిలు అనే లబ్ధిదారురాలుకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన ‘షిప్ట్ డిజైర్’ కారును ఆయన టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజక వర్గంలో మొదటి దఫా కింద వంద మంది లబ్ధిదారులకు దళితబంధు కింద కార్లు, ఆటోలు, వ్యాన్లు, ఇటాచీలు, వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు అందజేశామని అన్నారు. రెండో దఫా కింద మరో 500 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారు చేసి అధికారులకు పంపడం జరిగిందని అన్నారు.
దళితబంధు కింద తీసుకున్న లబ్ధిదారులు వచ్చే ఏడాది లోపు మరో కారు కొనుగోలు చేసుకొని ఓనర్లు కావాలని అన్నారు. అదే విధంగా కారును స్వంతంగా నడుపుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి, దోమలగూడ హనుమాన్ దేవాలయాల చైర్మన్లు ముచ్చకుర్తి ప్రభాకర్, గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, సీనియర్ నాయకులు ఆర్. రాజేశ్, రాంచందర్, జె. శ్రీశైలం వల్లాల రవియాదవ్, హరి, విశ్వనాథ్, కే. ప్రకాశ్, మాధవి, శివసిం హ, గాంధీనగర్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.