అంబర్పేట, సెప్టెంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాతనే రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి మెరగైందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అర్చకుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. అంబర్పేట నియోజకవర్గంలోని అమ్మవారి దేవాయాల్లో పని చేస్తున్న ఆరుగురు అర్చకులకు ప్రతి నెలా వేతనాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండున్నరేండ్లుగా ఆయన అర్చకులకు వేతనాలను అందజేస్తున్నా రు. ఇందులో భాగంగా శనివారం వారికి వేతనాలను అం దించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలను అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పలు దేవాలయాలను దూప, దీప నైవేద్యం పథకంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా నియోజకవర్గంలో ఆరుగురికి గౌరవ వేతనంగా నెలకు ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున అందజేస్తున్నానని వెల్లడించారు.
నర్సింహబస్తీ వినాయకుడిని కర్ణాటకలో నిమజ్జనంచేసేందుకు తరలింపు.. ఊరేగింపు ప్రారంభం..
నల్లకుంట డివిజన్ నర్సింహబస్తి వినాయకుడిని శనివారం కర్ణాటకలోని గానగాపూర్లో నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు తీసుకువెళ్లారు. ప్రతి సంవత్సరం ఈ వినాయకుడి నిమజ్జనం ఒక్కో పుణ్యక్షేత్రం లో నిర్వహిస్తుంటారు. 22 సంవత్సరాలుగా తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ర్టాలలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలలో నిమజ్జనం చేశారు. ఈసారి 23వ ఏటా ఈ వినాయకుడిని గానగాపూర్లో నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లారు. నిమజ్జన ఊరేగింపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. ఈసారి కొత్తగా అంబర్పేట నియోజకవర్గంలో మూడు బేబీ పాండ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్న వినాయకులను అక్కడ విమజ్జనం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు భూపతినాథ్, కార్యదర్శి శ్రీనివాస్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, బస్తీ నాయకులు లక్ష్మణ్, నాయకులు ఈ.ఎస్. ధనుంజయ, శంకర్, కట్టెల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.