శామీర్‌పేట, సెప్టెంబర్ 8 : నిరుపేదలను అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కీసర భాస్కర్‌కు వైద్య సహాయ నిమిత్తం రూ. 60 వేలు, తుర్కపల్లికి చెందిన రుద్రబోయిన రాంచందర్‌కు రూ.50 వేల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి మల్లారెడ్డి గురువారం బోయినిపల్లిలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని , నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మంద స్వామి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్, సెప్టెంబర్ 8 : కార్పొరేషన్‌లోని పాతబస్తీకి చెందిన కె.నాగరాజు వైద్య సహాయ నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ. 47,500 చెక్కు మంజూరైంది. ఈ చెక్కును జవహర్‌నగర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ బాధిత కుటుంబసభ్యులకు గురువారం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నవీన్, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, నాయకులు రమేశ్‌చారి, శ్రీనాథ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, సెప్టెంబర్ 8 : సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తున్నదని పీర్జాదిగూడ కార్పొరేటర్ పిట్టల మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం వి.శివశంకర్‌కు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.60 చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేటర్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.