జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 8: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. దళితులతో పాటు పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత ప్రభు త్వానికే దక్కుతుందన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో దళితబంధు లబ్ధిదారురాలు స్రవంతికి మంజూరైన కారును కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. దళితబంధు పథకం దళితుల జీవితాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. అనంతరం లబ్ధిదారు స్రవంతి దంపతులు మాట్లాడుతూ దళితబంధు పథకంతో జీవనోపాధిని కల్పించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, లక్ష్మణ్, వసంత్, మల్లేశ్, రవిశంకర్, జబ్బార్, లింగరాజ్, అహ్మద్ పటేల్, విలియం, న ర్సింహ, ఘని, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.