ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: జనగామ జిల్లాకు స్వా తంత్య సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌ డ్ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయం గా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గౌడ కులస్తు లు, కల్లుగీత కార్మికులు వెనుకబడి ఉన్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నా రు.
కల్లు గీత కార్మికులకు శాశ్వత లైసెన్సులు అమలు చేయాలని, గౌడ కులస్తులకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని విజ్ఞ ప్తి చేశారు. గీత కార్మికులకు యంత్రాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయాలన్నా రు. సర్వాయి పాపన్న పాలించి న ప్రాంతాన్ని పర్యాటక ప్రాం తంగా చేయాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గీత కార్మికులకు బీమాను రూ.5 లక్ష ల నుంచి పది లక్షలకు పెంచి నేరుగా వారి ఖాతాలోకి జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గౌడ్, మమత గౌడ్, అమరవేణి నిర్మల గౌడ్, సంజీవ్‌గౌడ్, శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.