పహాడీషరీఫ్, ఆగస్టు 24: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ జల్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా పేర్కొన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారని తెలిపారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించన్నారని తెలిపారు. 28 వార్డుల్లో ప్రతి వార్డు నుంచి 100 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఇన్చార్జి అవినాశ్‌రెడ్డి, కౌన్సిలర్లు శంషోద్దీన్, మజర్ అలీ, షేక్ అఫ్జల్, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, నాయకులు యూసుఫ్ పటేల్, బర్కత్ అలీ, మహిబూబ హసన్బాబా, అబ్దుల్ రవూఫ్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభం అనంతరం నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు ఆర్కేపురం డివిజన్ నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ పిలుపునిచ్చారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆర్కేపురం డివిజన్ చిత్రలేఅవుట్ కాలనీలో జనసమీకరణకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్కేపురం డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిలారెడ్డి, నాయకులు జగిని రమేశ్ గుప్తా, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, సాజీద్, దుబ్బాక శేఖర్, వంగూరి యాదవరెడ్డి, మురళీధర్‌రెడ్డి, దేవేందర్, మారం సుజాతారెడ్డి, యాదమ్మ, అనురాధ తదితరులు ఉన్నారు.
బడంగ్‌పేట, ఆగస్టు 24: కొంగరకలాన్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సమీకృత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలన్నారు. మీర్‌పేట ఎస్బీఐ బ్యాంక్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని పేర్కొన్నారు. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు, జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు, మహేశ్వరం, కందుకూరు మండలాల నుంచి, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని పిలుపు నిచ్చారు.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి