కార్వాన్, ఆగస్టు 24 : అన్నపూర్ణ ఆలయం 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు మూడు రోజుల పాటు కన్నుల పండువగా సాగాయి. చివరి రోజు బుధవారం శివపార్వతుల కల్యాణం వేలాది మంది భక్తుల మధ్య కోలాహలంగా వేద పండితుల మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. అనంతరం తీర్థ, ప్రసాదాలతో పాటు అన్న ప్రసాత వితరణ ఆలయ కమిటీ నిర్వాహకులు ఏ ర్పాటు చేశారు.
ఈ పూజా కార్యక్రమాలలో తెలంగాణ ప్రభుత్వ విప్ ఎం.ఎస్. ప్రభాకర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ కా సాని జ్ఞానేశ్వర్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కె. రాములు, కార్పొరేటర్లు దేవర కరుణాకర్, బోయిని దర్శన్, మాజీ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, జీవన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ బండారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు బండారి పాండు, సత్యనారాయణ, కృష్ణ, నర్సింహ, వెంకటేశ్, నాగరాజ్, ధన్‌రాజ్, గణేశ్, సందీప్, సాయి పాల్గొన్నారు.
మెహిదీపట్నం, ఆగస్టు 24 : కార్వాన్ నియోజకవర్గం తాళ్లగడ్డ అన్నపూర్ణ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఆలయ కమిటీ వారు అన్నపూర్ణ యూత్ అసోషియేషన్ సభ్యులను సన్మానించారు. బుధవారం యూత్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బండారి ధన్‌రాజ్, శ్రీకాంత్ సాగర్, మెట్టు నట్రాజ్, సూర్య ప్రకాశ్, ఆనంద్‌కుమార్, రాజేశ్, రతన్ సింగ్, విఘ్నేష్, క్రాంతిసాగర్, సచిన్ కుమార్, ప్రదీప్ కుమార్, జగదీశ్, శ్రీనివాస్ బిట్ల, శ్రీనివాస్ పసుపుల, అరవింద్ యాదవ్,యు.అనిల్ పాల్గొన్నారు.
నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్ డివిజన్ గుడిమల్కాపూర్ మందులగూడ సంకట విమోచన హనుమాన్ ఆలయంలో భక్తులు బుధవారం లక్ష తమలపాకుల అర్చన చేశారు. దత్తాత్రేయ భజన మండలి సభ్యులు, స్థానిక నాయకులు , చెన్నబత్ని ముఖేశ్ పూజలు చేశారు.