రవీంద్రభారతి, ఆగస్టు 23: విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, వారి కీర్తి ప్రతిష్టలు పెంచాలని పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుర్తింపు పొందిన హైదరాబాద్ పాఠశాలల సం ఘం 25వ వార్షిక వేడుకలు మంగళవా రం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కు, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. చదువుతోనే ఏదై నా సాధించవచ్చునని పేర్కొన్నారు.
ఏ దేశం అక్షరాస్యతలో ముందుంటుందో ఆ దేశం ప్రగతి పథంలో ముందువరసలో ఉంటున్నదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా చదివిస్తే ఆ కుటుంబం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యా, ఆ రోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నా రు. గుర్తింపు పొందిన పాఠశాలల అధ్యక్షుడు ఎంఎస్ ప్రసాద్, డీఈఓ ఆర్.రో హిణి, ఎం.అగస్టిన్ పాల్గొన్నారు.