సిటీబ్యూరో/అబిడ్స్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆది నుంచి వివాదాస్పదుడే. మతం పేరుతో ఇతర మతాలను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం.. ప్రజలను రెచ్చగొట్టడం.. అతడికి అలవాటుగా మారింది. తరచూ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం అతడికి సరదాగా మారింది. మతం సెంటిమెంట్ పేరుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూకుడుగా వ్యవహరిస్తూ తన పబ్బం గడుపుకొంటున్నాడు. మరో వర్గాన్ని, మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమవుతూ వస్తున్నాడు. ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ మొదట టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశాడు. మంగళ్‌హట్ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. అప్పటి నుంచి కూడా మత విద్వేష వ్యాఖ్యలతోనే ముందుకు సాగుతున్నాడు.
ఈ క్రమంలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించాడు. అప్పటి నుంచి కూడా ఆయన ఇతర మతాలను కించపరుస్తూ, సమాజంలో అలజడి సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దూకుడు మరింత పెంచాడు. అతడి చేష్టలతో బీజేపీ పార్టీకి కూడా అప్పట్లో తలనొప్పిగా మారాడని ఆ పార్టీ నాయకులే పలుమార్లు చర్చించుకున్నారు. ఈ విషయంలో పార్టీలోని ప్రధాన నాయకులతో వివాదాలు పెంచుకొని, వారిని బహిరంగంగా విమర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో పార్టీ కేంద్ర అధిష్టానవర్గం రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు.
రాజాసింగ్‌పై పలు కేసులు..