చార్మినార్, ఆగస్టు 23 : తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ ఫతేషానగర్కు చెందిన సయ్యద్ మహబూబ్ అలీ అలియాస్ ఖుస్రో (42) దావత్‌లలో వంటపనులు చేస్తుండేవాడు.
చిన్నప్పటి నుండే చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. జల్సా జీవితం గడిపేందుకు చోరీల మార్గం ఎంచుకుని 1998 నుంచి 20 కేసుల్లో నిందితుడిగా కొనసాగుతున్నాడు. ఇతడిపై నగరంతోపాటు సైబరాబాద్, నల్గొండ 1టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా పద్ధతి మార్చుకోక పోవడంతో సంతోష్‌నగర్ పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించి జైలుకు తరలించాడు.
తాళం వేసిఉన్న ఇండ్లే టార్గెట్
జూలైలో జైలు నుంచి బయటకు వచ్చిన ఖుస్రో తన స్నేహితుడు మహ్మద్ ఫెరోజ్‌తో కలిసి తాళం వేసిన ఇండ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడేవారు. ఫెరోజ్‌తో కలిసి ఖుస్రో జూలై నుంచి చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4, నల్లకుంట పోలీస్‌స్టేషన్, నల్గొండ టౌన్ పీఎస్ పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిపై ఆర్జీఐ, మీర్‌చౌక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 2 నాన్‌బెయిలబుల్ కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.
అయితే చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్వసనీయ సమచారం మేరకు దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని చిలకలగూడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 130 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు 500 గ్రాముల వెండి ఆభరణాలు, 37వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ సుమారు రూ.7 లక్షల వరకు ఉంటుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్సైలు శ్రీశైలం, షేక్ బురాన్, నరేందర్, నర్సింహులుతోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.