సికింద్రాబాద్, ఆగస్టు 22: విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించాలని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మర్రి రాజశేఖర్రెడ్డి, జక్కుల మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను చేతబూని దేశానికి రక్షణగా నిలుస్తున్న జవాన్లకు సంబంధించిన పాటలకు నృత్యాలు చేసి అకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం ఈ విధంగా స్వతంత్ర వేడుకలను నిర్వహించలేదని, కేవలం సీఎం కేసీఆర్కు దేశంపై ఉన్న అమితమైన ప్రేమే దీనికి నిదర్శనమన్నారు.
అనంతరం క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, నేతలు సురేశ్యాదవ్, ప్రవీణ్యాదవ్, సోమయ్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లాలు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతాఫల్మండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ హేమ హాజరయ్యారు.కళాశాల వి ద్యార్థులు దేశభక్తి చాటేలా అలరించేలా నృత్యాలు, దేశభక్తిపాటలు పాడి అలరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కార్పొరేటర్ హేమ సన్మానించారు.