ఉప్పల్, ఆగస్టు 20 : మునుగోడు ప్రజా దీవెన సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ఉప్పల్‌లో శనివారం ఘన స్వాగతం పలికారు. ఈమేరకు ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. హబ్సిగూడ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు స్వాగత తోరణాలు కట్టారు. హబ్సిగూడ నుంచి సీఎం కేసీఆర్ రాగానే మంత్రి మల్లారెడ్డి, ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాతం పలికారు. సీఎం రాక సందర్భంగా ఉప్పల్ రింగ్‌రోడ్డులో కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్వాగత వేదిక వద్ద సీఎం.. నేతలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కళాకారుల దాండియా, కోలాటం, డీజే సాంగ్స్, బంజార, వేషధారణలు, డప్పు కళాకారుల నృ త్యాలతో ఉప్పల్‌లో సందడి నెలకొన్నది. మంత్రి మల్లారెడ్డి చేసిన నృత్యం ఆకట్టుకుంది. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అరికపూడి గాంధీ, కేపీ వివేకానంద, మా గంటి గోపీనాథ్, దానం నాగేందర్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.