కీసర, ఆగస్టు 20 : చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి వెన్నతో పాటు వివిధ రకాల ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ఆలయ చైర్మన్ ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ శర్మ, ఎంపీపీ ఇందిర, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కీసరలోని పుడమి స్కూల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. రాధాకృష్ణులు, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు.
మాతా అరవింద కాలనీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ..
బోడుప్పల్, ఆగస్టు 20 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి…చెంగిచర్ల మాతా అరవింద కాలనీ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్ హాజరై కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్పొరేటర్లు చందర్‌గౌడ్, జంగయ్యయాదవ్, టీఆర్ఎస్ నాయకులు రవిగౌడ్, యాదవసంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్, నాయకులు, లింగంయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, గట్టయ్య, నర్సింహ, అంజయ్య, శ్రీనివాస్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో..
శామీర్‌పేట, ఆగస్టు 20 : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేవరయాంజాల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ పన్నాల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి, మాజీ ఉపాధ్యాయుడు రామారావు, ఆలయ మాజీ ధర్మకర్త నర్సింహా రెడ్డి, పూజారి సీతారామచార్యులు, ఆలయ క్లర్క్ వసంత్, విద్యార్థులు పాల్గొన్నారు.