సికింద్రాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 14: దేశ ప్రజలందరూ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. 75 వ స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి సీతాఫల్‌మండిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద పద్మారావు గౌడ్ పటాకులు కాల్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్లాసిక్ గార్డెన్స్‌లో ..
కంటోన్మెంట్ బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్లో నవకర్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకురాలు కవితా జైన్ ఆధ్వర్యంలో సునీతా మెహతా సహకారంతో నేషన్ వైడ్ అమృత్ మహోత్సవంలోభాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కావ్య కిషన్ రెడ్డి, ఖలీకర్ రెహమాన్ , అన్విత ( పర్వతారోహకుడు ), విజయ సురానా, గోపాల్ బల్దేవా, మధుసూదన్, సురేష్ మాలి, కమల, వికాస్ అగర్వాల్, ప్రీతి సుగంధ్ తదితరులు హాజరుకాగా బాలాజీ ఇన్ఫ్రా, స్పేస్ విజన్ గ్రూప్ మద్దతు ఇచ్చింది. జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సవరాలబస్తీలో తిరంగా ర్యాలీ
స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా చిలకలగూడ పరిధిలోని సవరాలబస్తీలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. స్థానిక నాయకుడు పొగర్తి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో చిలకలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. నరేష్, ఎస్సై నరేష్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్కందగిరి దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాస్ నగర్, ఫ్రైడే మార్కెట్, మహ్మద్ గూడ, మధురానగర్ కాలనీ, న్యూ అశోక్ నగర్, పార్సిగుట్ట మీదుగా సవరాలబస్తీకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో నాయకులు పొగర్తి ఎల్లయ్య, అడ్వొకేట్ శ్రీనివాస్, కావేటి నర్సింగరావు, రమేష్, హన్మంతరావు, ప్రణయ్, మహా త్మాచారి, కేశవ శ్రీనివాస్, పాండు, కిట్టు పాల్గొన్నారు.
తార్నాకలో .. డిప్యూటీ మేయర్
స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా ఏడో రోజు తార్నాకలో వజ్రోత్సవాల సంబురాలను ఘనంగా నిర్వహించారు. తార్నాకలోని విజయ డెయిరీ మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ ర్యాలీ (ఫ్రీడమ్ రన్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి హాజరయ్యారు. చింతల్ బస్తీ నుంచి మెట్టుగూడ చౌరస్తా వరకు దాదాపు 70 విజయ డెయిరీ లారీలతో ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అంనతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా అందరూ ఇప్పుడు స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అంజి, బాలరాజు, హమీద్‌ఖాన్, అబూబకర్, హుస్సేన్, శంకరయ్య, బాబు, యాదగిరి, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.