స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో బుధవారం వన మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు మొక్కలు నాటారు.
కొనసాగుతున్న జాతీయ జెండాల పంపిణీ
వజ్రోత్సవం సందర్భంగా ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. సర్కిల్ 18 పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఇండ్లు,షాపులతో పాటు కార్యాలయాలలో కూడా జెండాలను పంపిణీ చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని నమస్తే తెలంగాణ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి జీహెచ్ఎంసీ సిబ్బంది జాతీయ జెండాలను అందజేశారు.
విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన
భారత స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంచడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రపై అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్‌లోని పీవీఆర్ థియేటర్లో గాంధీ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాదిమంది విద్యార్థులు గాంధీ సినిమాను తిలకించారు. జీహెచ్ఎంసీ అధికారులు, బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేశారు.