మలక్‌పేట, ఆగష్టు 6: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను మూసారాంబాగ్, పాత మలక్‌పేట డివిజన్లలో నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా కొనియాడారు. తెలంగాణ వికాస సమితీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసాచారి అధ్యక్షతన దిల్‌సుఖ్‌నగర్‌లోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఆచార్య ప్రొ.జయశంకర్ సార్ జయంతి వేడుకలకు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ చెప్పిన మాటలు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాక్షాత్కరిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసాచారి, కార్యదర్శి పి.సోమిరెడ్డి, ప్రధా న కార్యదర్శి ఎ.శ్రీనివాస్, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎ.శ్రీధర్, తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశం, తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వేణుగోపాల్, కో ఆర్డినేటర్ కె.సైదులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయ
ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమ ని, జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం తపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కొనియాడారు. శనివారం మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవన్లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ రాష్ర్టాన్ని జయశంకర్‌సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నివిధాల అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు మడికొండ శ్రీను, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆశాడపు మధు, పగడాల రాము, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సార్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
సైదాబాద్, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు తెలంగాణ సమాజానికి మార్గదర్శకమని టీఆర్ఎస్ పార్టీ యాకుత్‌పురా నియోజకవర్గం ఇన్చార్జి సామ సుందర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతిని పురస్కరించుకుని ఐఎస్ సదన్ డివిజన్లోని కేశవనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ అశయాలు తెలంగాణ సమాజానికి, యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మెట్టు భాస్కర్‌రెడ్డి, కార్తీక్‌గౌడ్, గాజుల శివకుమార్, గోపాల్‌నాయక్, శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రొ. జయశంకర్ సార్‌కు ఘన నివాళి
చాదర్‌ఘాట్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విఠల్ రెడ్డి, శేకర్ నాయక్, బజరంగ్ ప్రసాద్, రమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీఎంఆర్ఎస్ సైదాబా ద్ బాయ్స్ స్కూల్లో ప్రిన్సిపల్ కె.విద్యాసాగర్ ఆధ్వర్యం లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ ఎం.లక్ష్మీప్రియ, షేక్ మునీర్, స్వాతీ, సునీత, కళ్యాణీ, హరీశ్ సిబ్బంది గౌసుద్దీన్, గోపాల్ స్టాఫ్‌నర్స్ నర్మద్ తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేటలో..
మలక్‌పేట, ఆగస్టు 6: తెలంగాణ మలిదశ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొ.కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు బాబు సుదర్శన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పాత మలక్‌పేట డివిజన్లోని వాటర్ వర్క్స్ కార్యాలయ కూడలి వద్ద శనివారం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, డివిజన్ అధ్యక్షుడు కామేష్, టీఆర్ఎస్ నాయకులు అమర్నాథ్గౌడ్, టిన్నుసింగ్, నక్క అమరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.