చాదర్‌ఘాట్, ఆగస్టు 6: షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. శనివారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో సైదాబాద్ తహసీల్ పరిధిలోని సైదాబాద్ కాలనీ, సపోటా బాగ్, ఎల్ఐసీ, అమీన్ కాలనీ, న్యూ మలక్‌పేట, గాంధీనగర్, గ్రీన్ ల్యాండ్ కాల నీ, ముసారాంబాగ్, అఫ్జల్‌నగర్, సలీంనగర్ ప్రాంతాలకు చెందిన 69 మంది మహిళలకు రూ.50,05,800 విలువ చేసే షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా అంబర్‌పేట తహసీల్ పరిధిలోని కమల్‌నగర్, పద్మానగర్, శంకరన్గర్, వాహెద్‌నగర్, పాతమలక్‌పేట, అక్బర్‌బాగ్, పల్టన్, కాలాడేరా, పాపయ్య బస్తీ ప్రాంతాలకు చెందిన 69 మంది మహిళలకు రూ. 69,08,004 విలువ చేసే షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అహ్మద్ బలాల అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ స్పెషల్ ఆర్ఐ మధుసూదన్‌రెడ్డి, అంబర్‌పేట ఆర్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
చాలా కాలంగా పెండింగ్‌లో తాగునీటి సమస్యల పరిష్కారానికి వెంటనే తగిన చర్య లు తీసుకోవాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం జలమండలి అధికారులతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల దారుస్సలాంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎం, డీజీఎం, మేనేజర్లతో సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా చాలా కాలంగా పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.