దుండిగల్, ఆగస్టు 6: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.శనివారం శంభీపూర్‌లోని ఆయన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. దుండిగల్ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ తుడుం పద్మారావు, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, నిజాంపేట కార్పొరేటర్ వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాపు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ సీడీని శనివారం శంభీపూర్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ ఛైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, పోలీస్ గోవింద్‌రెడ్డి, సాయికిరణ్‌గౌడ్, కాపు సంఘం నాయకులు ఉన్నారు.
బౌరంపేట్లోని బొడ్రాయి నుంచి వీఎన్ఆర్ కళాశాల వరకు బీటీ రోడ్డు వేయించాలని కోరుతూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా ఈ నెల 14న జరిగే బంగారు మైసమ్మ బోనాల ఉత్సవాలకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మురళీయాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, గాజులరామారం డివిజన్ అధ్యక్షుడు విజయరామిరెడ్డి తదితరులు ఉన్నారు.