ఖైరతాబాద్, ఆగస్టు 3 : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం లేస్ అకాడమీ ఉచిత ఆప్టిట్యూడ్ శిక్షణ అందిస్తోంది. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్, సివిల్స్ తదితర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం ‘లేస్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ ఎం. నరసింహ వివరాలు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆన్లైన్ శిక్షణ ఇవ్వాలంటే వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయని, దీంతో పేద విద్యార్థులకు ఆ విద్య అందుబాటులో లేకుండా పోతున్నదన్నారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు సామాన్యులు కూడా సన్నద్ధం కావాలన్న ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా ఉచిత శిక్షణ అందించేందుకు ముందుకొచ్చామన్నారు.
లేస్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ లేదా www.laceacademy.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు పొందుపర్చాలి. యాప్‌లో ఆప్టిట్యూడ్ అనే అప్షన్‌పై క్లిక్ చేసి మనకు కావాల్సిన మెటీరియల్‌ను తీసుకోవచ్చు. ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ తదితర అంశాల్లో స్టడీ మెటీరియల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని నరసింహ తెలిపారు. ప్రతి ఏడాది సబ్జెక్ట్‌లను అప్డేట్ చేస్తారు. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే జీవిత కాలం మొత్తం వాటిని భద్రపర్చుకోవచ్చన్నారు. కేవలం ఆన్లైన్ మాత్రమే ఫీజు తీసుకుంటున్నామని, యాప్ ద్వారా చేసుకున్న వారందరికీ ఉచితంగా మెటీరియల్ అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఫ్యాకల్టీలు అముల్య రతన్ సుందరరావు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.