కీసర, ఆగస్టు 3 : కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇతర పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు, నాయకులు మేడ్చల్‌లో మంత్రులు హరీశ్ రావు, చామకూర మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మేడ్చల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన శివశంకర్, పరశురాం, రాఘవులు, నర్సింహస్వామి, వెంకటేశ్, శంకర్, స్వామి, బాల్‌రాజ్, కుమార్‌తో పాటు 100మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ, ఏఏంసీ డైరెక్టర్ ఈటీవీ సత్యనారాయణ, యువత అధ్యక్షుడు తటాకం భానుశర్మ, నాయకులు చినింగని బాల్‌రాజ్, డబ్బి నర్సింమారెడ్డి, నత్తి భూపాల్, పరశురాం, పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆకర్శితులై..ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన మహిళలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల పరిధికి చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లి ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి ఆశయాలు, ఆలోచనలతో పాటు ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులు నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు పోచబోయిన జగదీశ్ యాదవ్, సిద్దగోని జగదీశ్ గౌడ్, ఆనంద్‌యాదవ్, నాయకులు దుర్గారావు, రమేశ్, గోపు శివ, సురేశ్, రమణమ్మ, లక్ష్మణ్, మహేశ్, జకీర్, సతీశ్, సుధాకర్, యాకూబ్, మౌలానా, జుబేరా, అస్లాం పాల్గొన్నారు.