ఖైరతాబాద్, ఆగస్టు 3 : బ్రహ్మకుమారి శ్రీనగర్‌కాలనీ సేవా కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 6న శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో సాయంత్రం 5.30గంటలకు రజతోత్సవ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి సిస్టర్ రాధా తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మకుమారి డాక్టర్ ఉమారాణి, శక్తి, వంశీతో కలిసి మాట్లాడారు. ఓం శాంతి రీట్రీట్ సెంటర్ ఢిల్లీ రాజయోగి బీకే ఆశా దీదీ, హైదరాబాద్ రీజినల్ సెంటర్స్ ఇన్చార్జి రాజయోగిని బీకే కుల్దీప్ దీదీల నేతృత్వంలో జరిగే ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నలంద ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీనివాస్ రాజ్, ఆర్అండ్బీ అడ్మినిస్ట్రేషన్ విభాగం చీఫ్ ఇంజినీర్ పింగళి సతీశ్‌లు హాజరవుతున్నారని తెలిపారు. దీంతో పాటు గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ‘ఎన్హాన్సింగ్ ఎఫెక్టీవ్నెస్’ పేరుతో సదస్సు, ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు రాజస్తాన్‌లోని మౌంట్ అబు శాంతివన్ క్యాంపస్‌లో జాతీయ మీడియా సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు.