రామంతాపూర్, జూలై 31 : ఉప్పల్, చిలుకానగర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం బోనాలు ఉత్సవాలు అం గరంగ వైభవంగా జరిగాయి.. మహిళలు బోనంతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉప్పల్‌లోని శ్రీపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ బోనాల పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ప్ర భుత్వం బోనాల సందర్భంగా ఆలయాలకు ప్రత్యేక నిధు లు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నా యకులు బేతి సుమంత్‌రెడ్డి, గడ్డం రవికుమార్, వేముల సంతోశ్‌రెడ్డి, మేకల మధుసూదన్‌రెడ్డి, చింతల నర్సింహరెడ్డి, వేముల వెంకట్‌రెడ్డి, రాజు, గొరిగె ఐలేశ్, అరటికాయల వంశీ, తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మర్లమైసమ్మ, పోచమ్మ ఎల్లమ్మ, దేవాలయాల్లో అమ్మవారికి బోనం సమర్పించారు. కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్‌ముదిరాజ్ బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఎమ్మెల్యే బేతి సు భాష్‌రెడ్డి, తదితరులు పూ జలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కొం డల్‌రెడ్డి, రామానుజం, జగన్, రవీందర్‌గౌడ్, ప్రవీణ్, బాలు, సుభద్ర, సరిత, లక్ష్మి, కుమ్మరి సంఘం ప్రతినిధు లు సత్తయ్య, గౌరయ్య, దశరథ, గణేశ్, బాలమ ణి, సాయిలు, అశోక్ పాల్గొన్నారు.