అంబర్‌పేట, జూలై 30 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ గోల్నాకకు చెందిన బి. శ్రావణ్‌కుమార్‌కు దళితబంధు మంజూరైంది. ఈ పథకం కింద అతను డీజే సౌండ్ సిస్టంను కొనుగోలు చేసి దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబర్‌పేట నియోజకవర్గంలో మొదటి విడత కింద వంద మందికి దళితబంధు పథకం మంజూరైందని చెప్పారు. వారిలో చాలా మంది ఇప్పటికే యూనిట్లను ప్రారంభించారన్నారు. రెండో విడత కింద మరో 1500 వందల మందికి దళితబంధు మంజూరవుతుందని పేర్కొన్నారు. దళితబంధుతో దళితులు ఆనందంగా ఉన్నారన్నారు.
వారి జీవన స్థితిగతులు పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దళారులను నమ్మొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, సీనియర్ నాయకులు కూర నరేందర్, భాస్కర్‌గౌడ్, రాముయాదవ్, రెడ్డిపాక రాము, దళిత సంఘాల నాయకులు లక్ష్మణ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బడుగుల బాలకృష్ణ, మూర్తి, బొజ్జ రాజు, శంకర్‌గౌడ్, గులాబ్ సతీశ్, చంద్రకాంత్, వసంత నాయుడు, భిక్షపతి పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి ..
గోల్నాక : అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న వంజరి సామాజిక వర్గం సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. రాష్ట్ర వంజ రి కులసంఘానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చొరవతో సీఎం కేసీఆర్ ఉప్పల్ భగాయత్‌లో ఎకరం భూమి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ఆ సంఘం అధ్యక్షుడు బొమ్మెల శంకర్ నేతృత్వంలో అక్కడి వంజరి సంఘం శనివారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. తమకు స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వంజరి సంఘం ప్రతినిధులు లక్ష్మీపతి, రంజిత్, కిషన్, శంకర్, తుకారాం, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.