మేడ్చల్ కలెక్టరేట్, జూలై 30: పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన 6 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సుజాత, నాయకులు మొయినుద్దీన్, నరేశ్ , కుమార్, మాజీద్, ఆజంబాయ్, నూర్ భాయ్, సైఫ్ఖాన్ పాల్గొన్నారు.
మూడుచింతలపల్లికి చెందిన ఒకరికి..
శామీర్పేట, జూలై 30 : మూడుచింతలపల్లి మండలానికి చెందిన కే.బాలాచారికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.30 వేల చెక్కును మంత్రి మల్లారెడ్డి శనివారం ఆయన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మురళీ గౌడ్, బాలాచారి, తదితరులు పాల్గొన్నారు.
కాచవానిసింగారం లబ్ధిదారుడికి..
ఘట్కేసర్ : మండల పరిధిలోని కాచవానిసింగారం గ్రామం మహేశ్వరి కాలనీకి చెందిన మొర రాజు కూతురు వైద్య సహాయ నిమిత్తం మంత్రి మల్లారెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రూ.50 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును లబ్ధిదారుడికి కాచవానిసింగారం సర్పంచ్ వెంకట్ రెడ్డి అందజేశారు. పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, సభ్యులు మహేశ్ కుమార్, శ్యామ్ పాల్గొన్నారు.
కీసరకు చెందిన ఒకరికి..
కీసర, జూలై 30 : కీసర మండల కేంద్రానికి చెందిన దాసారి భిక్షపతికి సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు వెంకటేశ్ ముదిరాజ్, బాల్రాజ్, గణేశ్, సుమన్ బన్నీ, పరమేశ్యాదవ్, సతీశ్ యాదవ్, అంజయ్య, సుజాత, విష్ణు, మధుయాదవ్ పాల్గొన్నారు.