మియాపూర్, జూలై 25 : దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు నియోజకవర్గంలో ఈ పథకాన్ని అర్హులైన నిరుపేద దళితులకే అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దళితబంధు పథకం కింద వివేకానందనగర్ ఆర్పీ కాలనీకి చెందిన బాబురావు, భద్రయ్యలకు మంజూరైన మినీ టిప్పర్‌ను పార్టీనేత బండి రమేశ్, కార్పొరేటర్లు రోజాదేవి, వెంకటేశ్‌లతో కలిసి విప్ గాంధీ సోమవారం తన నివాసంలో అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, భాస్కర్‌రావు, కాశీనాథ్, వాసు, పోశెట్టి, అశోక్, లింగయ్య పాల్గొన్నారు.
యూజీడీ పనులకు శంకుస్థాపన..
ఆల్విన్ కాలనీ డివిజన్ శుభోదయ కాలనీలో రూ.18 లక్షలతో నిర్మిస్తున్న యూజీడీ పనులకు కార్పొరేటర్లు వెంటేశ్‌గౌడ్, శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురుగు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా యూజీడీని అంతటా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కాలనీల్లో పక్కా రహదారులను నిర్మిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల తోడ్పాటుతో అధిక నిధులను మంజూరు చేయించుకుంటున్నట్లు గాంధీ పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజరు ఝాన్సీ, రవీందర్‌రెడ్డి, శివ, పార్టీ నేతలు పాల్గొన్నారు.
చందానగర్‌లో కల్వర్టు నిర్మాణ పనులు పరిశీలన..
కొండాపూర్, జూలై 25 : ప్రజా సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ప్రీతి దవాఖాన సమీపంలోని నాలాపై రూ.1.70లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా విస్తరణతో పాటు నాలా పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ – చందానగర్ల మధ్య రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రీతి దవాఖాన సమీపంలో నాలాపై రోడ్డు విస్తరణలో భాగంగా నూతన కల్వర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గౌతమ్‌గౌడ్, లక్ష్మారెడ్డి, కిరణ్ యాదవ్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.