దుండిగల్, జూలై 25 : ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు న్నానని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ కాలనీలు, బస్తీల సంక్షే మ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు పేట్‌బషీరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆ య నను కలిసి వినతి పత్రాలు, బో నాలకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజ కవర్గంలో నెలకొ న్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే.. వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
చింతల్ విభాగ్ ఏబీవీపీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఇటీవల బహదూర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించడం, ఒకేషనల్ డిగ్రీ కళాశాలకు రూ.1 కోటి విరాళం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో దానికి పక్కా భవన నిర్మాణం, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి.. త్వరలోనే ఏర్పాటయ్యేలా కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రభుత్వ విద్యా సంస్థల హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
దుండిగల్‌లోని హెచ్ఎంటీ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ డైరెక్టర్లు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు సత్యనారాయణ, తులసీదాస్, శ్రీశైలం, అనంతరాములు, విజయలక్ష్మి, కళావతి, రాజేందర్, బల్వంత్‌రెడ్డి, సురేశ్ ఉన్నారు.