చిక్కడపల్లి/ కవాడిగూడ, జూలై 24 : కార్యకర్తలు అంకితభావంతో పనిచేసినప్పుడే పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు డి. శివముదిరాజ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ చౌరస్తాలో పేదలు, జీహెచ్ఎంసీ కార్మికులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, రాజా దీన్ దయాళ్రెడ్డి, సోమసుందరం, బల్లా ప్రశాంత్, రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలను ఆదివారం జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నా రు. అనంతరం కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణు లు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్శిగుట్టలో టీఆర్ఎస్ నేత టీ సోమసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ పాల్గొని కేటీఆర్ జన్మదిన కేక్ కట్ చేశారు. రాంనగర్ ఈ సేవా వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని కేక్ కట్ చేశారు. నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మన్నే దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటకృష, టీఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు రావులపాటి మోజస్, తెలంగాణ హౌస్‌ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, రమేశ్‌రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్ పాల్గొన్నారు.
నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో కేటీఆర్ఆర్ జన్మదినం సందర్భంగా చిక్కడపల్లిలో పేదలకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హాజరయ్యారు.
డివిజన్లోని సహారాబేకరి వద్ద టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్ ఆధ్వర్యంలో కేటీఆర్ఆర్ జన్మదినం సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్‌కుమార్, గుండు జగదీశ్ బాబు, మారిశెట్టి నర్సింగ్ రావు, గడ్డమీది శ్రీనివాస్, రాజ్‌కుమార్, ప్రేమ్, సంతోష్, జి.వెంకటేశ్, నవీన్ యాదవ్, పాశం రవి, శ్రీధర్‌రెడ్డి, విట్టల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.