చాంద్రాయణగుట్ట / చార్మినార్, జూలై 24 : లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు కన్నుల పండువగా జరిగాయి. ఉమ్మడి దేవాలయాల్లోని ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్ర్తాలతో పాటు బంగారు బోనం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్ పర్సన్లు శీరా రాజ్‌కుమార్, చెన్నబోయిన శివకుమార్ యాదవ్,పోసాని సురేందర్,ఎ.బద్రీనాథ్‌గౌడ్,మాజీ చైర్మన్ కె.వెంకటేష్, శ్రీ మహంకాళి మహేష్‌గౌడ్ మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు జి.అరవింద్ కుమార్ గౌడ్,బంగ్లా రాజు యాదవ్,కాశీనాథ్‌గౌడ్,కె.విష్ణుగౌడ్,ఎ.మాణిక్‌ప్రభుగౌడ్,తిరుపతి శివకుమార్ పాల్గొన్నారు.
అబిడ్స్ / సుల్తాన్‌బజార్, జూలై 24 : గోషామహల్ నియోజక వర్గ పరిధిలోని బేగం బజార్, మంగళ్‌హాట్, గోషామహల్, గన్‌ఫౌండ్రీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాలలోని అమ్మవారి ఆల యాలలో సంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు.
బోనాలను పురస్కరించుకొని భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. డప్పువాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాలు, శివసత్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుండే ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
కార్వాన్ /జియాగూడ, జూలై 24 : కార్వాన్ గ్రామ దేవత అయినటుంవంటి దర్బార్ మైసమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని తెల్లవారుజామునుండే అమ్మవారికి బోనం, తొట్టెల సమర్పించారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ విభాగాలైన జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్ కో, పోలీస్ విభాగం తదితర శాఖల అధికారులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో బీజేపీ నాయకులు విజయశాంతి పాల్గొన్నారు. సబ్జిమండీలోని మహంకాళి, నల్లపోచమ్మ అమ్మవార్ల ఆలయాల్లో అమ్మవారి ప్రతిమను ఏనుగు అంబారీ పై ఘనంగా నిర్వహించారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, జోగిని శ్యామల పాల్గొన్నారు.
మెహిదీపట్నం, జూలై 24 : నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలలో భక్తులు బోనాలను సమర్పించి పూజలు చేశారు. నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్ పటేల్ చమన్ ఏడుగుళ్ల పోచమ్మ ఆలయంలో జరిగిన బోనాల పూజలలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు, యువనాయకులు సాయికిరణ్ యాదవ్, టీఆర్ఎస్ కార్యదర్శి బండి రమేశ్,నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్.ఆనంద్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.