జవహర్‌నగర్, జూలై 24: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, ప్రతి గ్రామంలో చెరువులు నిండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్లో మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మేయర్ మేకల కావ్య బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
nశామీర్‌పేట : మండలంలోని జగన్‌గూడ, నాగిశెట్టిపల్లి, కేశవరం, కొల్తూర్ గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించారు. గ్రామ దేవతలకు భక్తులు బోనంతో పాటు నైవేద్యం సమర్పించారు. ఎంపీపీ హారికామురళీగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, సర్పంచులు పాల్గొన్నారు.
nఘట్కేసర్ : ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లో బోనాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ, మహకాంళీ అమ్మవారికి ప్రజలు బోనం తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించారు.చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కమిషనర్ వసంత, కౌన్సిలర్లు వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కోఆప్షన్ సభ్యులు శౌకత్ మియా, అరుణ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
nకీసర : చీర్యాల్, కీసర మండల కేంద్రాల్లో బోనాలు నిర్వహించారు. చీర్యాల్‌లో పోచమ్మ, కీసరలో బంగారు మైసమ్మ అమ్మవార్లకు ప్రజలు బోనాలు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించారు. చీర్యాల్, కీసరలో సర్పంచ్ ధర్మేందర్, ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ తిరుమలరెడ్డి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
nమేడ్చల్ రూరల్ : బోనాల పండుగను మేడ్చల్ మండలంలోని వివిధ గ్రామాలు, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 5వ వార్డు, సుతారిగూడలో జరిగిన బోనాల ఉత్సవాల్లో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
nమేడ్చల్ కలెక్టరేట్ : దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలో బోనాల పండుగ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. నాగారంలో దాతల సహకారంతో నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీతాగౌడ్, చంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, మల్లేశ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
nపీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు బోనం ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి ఆయా డివిజన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, మంజుల రవీందర్, అనంత్‌రెడ్డి, శారద ఈశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.