సిటీబ్యూరో/నాంపల్లి క్రిమినల్ కోర్టు: ర్యాగింగ్, డ్రగ్స్ తదితర వాటికి బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మురళీ మోహన్ విద్యార్థులకు సూచించారు. సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు భవిష్యత్ ఉండదని, చట్టరీత్యా కఠిన శిక్షలు అమలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి రవీంద్ర, సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా డైరెక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.