సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): నెలలు నిండకుండా పుట్టిన ఐదుగురు చిన్నారులకు రెయిన్ బో చిల్డ్రన్స్ హా స్పిటల్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించించారు. వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఇటీవల ఐదుగురు శిశువులు నెలలు నిం డకుండానే తక్కువ బరువుతో జన్మించా రు. అందులో అర్జున్ వర్మ అనే శిశువు 26 వారాల్లోనే కేవలం 430 గ్రాముల బరువుతో అతి క్లిష్ట పరిస్థితుల్లో జన్మించాడు. ఈ శిశువుకు దాదాపు 85 రోజుల పాటు చికిత్స అందించి పూర్తిగా కోలుకున్న తరువాత గురువా రం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా నెలలు నిండకుండా నే క్లిష్ట పరిస్థితులతో జన్మించిన ఐదుగురు శిశువులను దవాఖానలో నిర్వహించిన ఎన్ఐసీయూ గ్రాడ్యుయేషన్ వేడుకలో డిశ్చార్జ్ చేశారు. వైజాగ్ రెయిన్ బో హాస్పిటల్ సీనియర్ ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సీహెచ్ రాగసుధ మాట్లాడుతూ, ఐదున్నర నెలల గర్భవతి హనీషా కొన్ని సమస్యలతో దవాఖానలో చేరినట్లు తెలిపారు.
ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భంలో ఉమ్మ నీరు లేదని తేలడంతో, అవసరమైన చికిత్స అందించినప్పటికీ వారం రోజు ల తరువాత పరిస్థితి క్లిష్టంగా మార డం, దీంతో శస్త్రచికిత్స ద్వారా ప్రస వం జరిపినట్లు తెలిపారు. అయితే, జన్మించిన శిశువు కేవలం 430 గాము ల బరువు, ఉండటమే కాకుండా అవయవాలు సైతం అభివృద్ధి చెందుతు న్న దశలో ఉన్నట్లు తెలిపారు. శిశువు స్వతహాగా శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి, చర్మం చాలా పలుచగా ఉండ టం, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు అధికంగా ఉండటం తో శిశువును ప్రత్యేక ఇన్క్యుబేటర్లో ఉంచినట్లు తెలిపా రు. 50 రోజుల పాటు ఎన్ఐసీయూలో పెట్టి చికిత్స అం దించినట్లు వివరించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ 85 రోజుల పాటు చికిత్స అందించడంతో తమ శ్రమ ఫలించి, ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకున్న ట్లు తెలిపారు. శిశువుకు డా.విశాల్ కోలీ నేతృత్వ ప్రత్యేక బృందం చికిత్స అందించినట్లు డా.రాగసుధ తెలిపారు.